తుఫాన్.. రేపు బాపట్లలో స్కూళ్లకు సెలవు

AP: మురసు తుఫాన్ దృష్ట్యా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంగళవారం బాపట్ల జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సూర్యలంక బీచ్‌కు పర్యాటకులు రావొద్దని హెచ్చరించారు. నిజాంపట్నం హార్బర్ వద్ద పదో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. కాగా, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕