AP: తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్లతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సరఫరాను నిలిపివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.