AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అర్నబ్' అతి తీవ్ర తుఫాన్‌గా మారి తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనించిన ఈ తుఫాన్, ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కి.మీ, కాకినాడకు 180 కి.మీ, మచిలీపట్నానికి 270 కి.మీ, బాపట్లకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ జిల్లా ఉప్పాడలో తుఫాన్ ప్రభావంతో సముద్రపు నీరు రోడ్డుపైకి చేరి సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. దాంతో అప్రమత్తమైన స్థానికులు తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు..