AP: తీరం వైపు వేగంగా దూసుకువస్తున్న మొంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం 100 మీటర్లకుపైగా ముందుకు చొచ్చుకువచ్చింది. తుఫాన్ ధాటికి తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కృత్తివెన్ను, అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, కోడూరు మండలాల్లో గాలుల తీవ్రత మరింతగా పెరిగింది. ఈ గాలుల ఉద్ధృతికి తీర ప్రాంత ప్రజలు భయంతో చిగురుటాకులా వణుకుతున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.