తుఫాన్ ముప్పు.. బీచ్‌‌లు తాత్కాలికంగా మూసివేత (వీడియో)

AP: అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల, చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేశారు. వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు బీచ్‌లకు రావొద్దని, వచ్చినవారు వెనుదిరగాలని సూచించారు. అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు బీచ్‌లలో అనుమతి లేదని చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕