వింత పురుగులు.. స్కూల్‌కు సెలవు

AP: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు వింత పురుగుల బారిన పడ్డారు. పాఠశాల ఆవరణలోని చెట్టుపై నుంచి పడిన పురుగులు దాదాపు 19 మంది విద్యార్థులను కుట్టడంతో వారి ఒంటిపై దద్దుర్లు, మంటతో ఇబ్బందిపడ్డారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను పుత్తూరు ఆస్పత్రికి తరలించి, పాఠశాలకు సెలవు ప్రకటించారు. చెట్ల కింద ఆడుకుంటున్న సమయంలో పురుగులు తమపై పడ్డాయని విద్యార్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్