ఉద్ధృతంతా ప్రవహిస్తున్న వాగులు, నదులు

AP: అనకాపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మాడుగుల నియోజకవర్గంలో తాచేరు వాగు పొంగి పాత బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అల్లూరి ఏజెన్సీ, నర్సీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు చోట్ల కాజ్‌వేలు, వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు, దీనివల్ల పాడేరు, నర్సీపట్నం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕