ఉచిత బస్సు పథకానికి 'స్త్రీ శక్తి' పేరు ఖరారు

AP: రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఉచిత బస్సు పథకానికి 'స్త్రీ శక్తి' అని ప్రభుత్వం పేరు ఖరారు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్ల పై 'స్త్రీ శక్తి' అని ముద్రణ ఉంటుందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్