AP: గ్యాస్ సిలిండర్ సరఫరాలో నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన అవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో ఉన్నతాధికారులు, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. పదే పదే తప్పులు చేసే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరించాలని, బ్యాక్‌లాగ్స్‌ను ఈ వారంలోపు పూర్తి చేయాలని సూచించారు.