బలపడిన అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది బాలాసోర్‌కు 50 కి.మీ, చాంద్‌బలి-దిఘాకు 60 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో బాలాసోర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్