దూసుకొస్తున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో వర్షాలు!

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడిందని, ఇది నేడు (సోమవారం) వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. 48 గంటల్లో ఇది తుఫాన్‌గా బలపడుతుందని అంచనా వేసింది. ఇక మంగళవారం బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నేడు నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్