AP: విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. తోటి విద్యార్థి దాడి చేయడంతో 9వ తరగతి విద్యార్థి సుందరాడ కార్తీక్ కిందపడిపోయాడు. దీంతో అక్కడున్నవారు ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు విచారణచేపట్టారు.