AP: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) విద్యార్థినులతో వంట, పారిశుధ్య పనులు చేయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవాల్సిన విద్యార్థినులతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.