మహిళలకు సబ్సిడీతో ఎలక్ట్రిక్​ వాహనాలు

AP: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెప్మాతో ర్యాపిడోను అనుసంధానం చేసి ఉపాధికి బాటలు వేశారు. ద్విచక్రవాహనానికి రూ.12 వేలు, ఆటో తీసుకుని ర్యాపిడోకి వాడుతుంటే రూ.30 వేల సబ్సిడీ ఇస్తున్నారు. విజయవాడ, విశాఖలో 400 మంది చొప్పున లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,800 మందిని ర్యాపిడో నెట్‌వర్క్‌లో చేర్చడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్