జనసేనలో అధికారికంగా చేరిన సుకుమార్ రెడ్డి

AP: కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి జనసేన పార్టీలో అధికారికంగా చేరారు. మధ్యాహ్నం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సుకుమార్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలో సుకుమార్ రెడ్డి అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕