పులివెందుల డీఎస్పీ వద్దకు సునీత

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మలుపులు చోటుచేసుకున్నాయి. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై తప్పుడు కేసు నమోదుకు కారణమైన రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఎస్సై రామకృష్ణారెడ్డిలపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. లింగాల మండలానికి చెందిన కుళాయప్ప ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కుళాయప్పపై రాజేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పులివెందుల వచ్చిన సునీత, డీఎస్పీ మురళీనాయక్ ను కలిసి విచారణ చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్