AP: రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ద్రోణి ప్రభావంతో బుధవారం అల్లూరి, తూ.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 42°C - 44°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.