ఏపీలో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు

AP: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 79 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 152 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపనున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  ద్రోణి ప్రభావంతో ఇవాళ మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్