సూపర్ సిక్స్ హామీలు కొందరికే అమలు: షర్మిల

AP: సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం కొందరికే అమలు చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే.. 47 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ఇస్తోంది. ఇది అన్నదాత సుఖీభవ కాదు.. దుఖీఃభవ. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20 వేలు ఇస్తుందని చంద్రబాబు ఎన్నికల ప్రచారం చెప్పారు. కానీ ఇప్పుడేమో రూ.14 వేలే ఇస్తున్నారు.’ అని షర్మిల ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్