AP: అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభను కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు బంపర్ హిట్ చేశారని సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. '15 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహించాం. ప్రజలకు ఇప్పటివరకు ఏం చేశామో చెప్పడమే కాకుండా, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో వివరించి వారి మద్దతు కోరాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.