పిన్నెల్లి బ్రదర్స్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పి.వెంకట్రామిరెడ్డి (పిన్నెల్లి బ్రదర్స్‌)ల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా, ప్రభుత్వం నుంచి సూచనలు అందలేదని తెలియజేసి వాయిదా కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను మరో తేదీకి మార్చింది. ఈ కేసులో కోర్టు ఇప్పటికే పిన్నెల్లి సోదరులకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్