తుని చిన్నారి ఘటనలో కారుపై అనుమానం.. క్లారిటీ (వీడియో)

AP: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో ఓ కారుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిన్నారి తాతను ఢీకొట్టిన కారుకు సంబంధం ఉందనే ప్రచారంపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఇటీవల జ్ఞానేశ్వరి మిస్సింగ్ పోస్టర్లు అంటించేందుకు వెళ్లిన సమయంలో తనను ఓ కారు ఢీకొట్టిందని తెలిపారు. అయితే ఆందోళనలో పాప ఇంటి సమీపంలో కనిపించిన కారు, తనను ఢీకొట్టిన కారు ఒకటేనని మీడియాకు చెప్పానని వివరించారు. తనపై ఎలాంటి ఉద్దేశపూర్వక దాడి జరగలేదని, అది కేవలం రోడ్డు ప్రమాదమేనని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశంపై వస్తున్న అనుమానాలకు ఆయన వివరణతో చెక్ పెట్టారు.

సంబంధిత పోస్ట్