పరకామణి కేసులో కీలక వ్యక్తి మృతి.. హత్య కోణంలో విచారణ

తిరుపతి జిల్లాలో పరకామణి కేసులో కీలక వ్యక్తి, టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ మృతదేహం తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై లభ్యమైంది. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీష్ కుమార్, ఈ నెల 6న సీఐడీ విచారణకు హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో, కేసు కీలక దశలో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే ట్రాక్‌ పక్కన రక్తపు గాయాలతో కనిపించడంతో పోలీసులు హత్య కోణంలో విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్