AP: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలంలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. హనుమంత్ అనే వ్యక్తి లక్ష్మీదేవి(45)ని 28 ఏళ్ళ క్రితం పెళ్లిచేసుకున్నాడు. హనుమంతు భార్యపై అనుమానంతో నిత్యం గొడవపడుతూ, శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. వ్యవసాయ పరికరంతో నిద్రిస్తున్న భార్యపై దాడి చేశాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.