ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రాబోయే రోజుల్లో సువర్ణధ్యాయం రానుందని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహా యాదవ్ తెలిపారు. ముఖ్యంగా కులవృత్తులు, చేతివృత్తుల వారికి 'ఆదరణ' పథకం ద్వారా గతంలోలాగే అండగా నిలవడానికి సమగ్రంగా చర్చలు జరిగాయని చెప్పారు. ఈ పథకం ద్వారా వెనుకబడిన తరగతుల వారికి చేయూతనివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు.