AP: రెండేళ్లుగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 143 లక్షల టన్నుల చెత్తను డిస్పోజ్ చేశామన్నారు. అక్టోబర్ 2 నాటికి మిగతా 10 లక్షల టన్నుల చెత్త డిస్పోజ్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వేస్ట్ టు ఎనర్జీ విధానంలో చెత్తను రీసైక్లింగ్‌కు పంపుతున్నామన్నారు. చెరువులు శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, స్వర్ణ మున్సిపాలిటీ 2047 లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.