డ్వాక్రా మహిళలకు తీపికబురు.. చేనేత క్లస్టర్లకు కేంద్రం ఆమోదం

AP: డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం, కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా, గుంటూరులో పచ్చళ్ల తయారీ, బాపట్ల, కర్నూలులో చేనేత క్లస్టర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. మరో ఆరు క్లస్టర్లకు త్వరలో అనుమతులు రానున్నాయి. ఈ 9 క్లస్టర్ల ద్వారా 11,475 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మొత్తం ₹ 100 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా గుంటూరులో 2,500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది.

సంబంధిత పోస్ట్