AP: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆహార పదార్థాల తయారీ, విక్రయాలు చేసే మహిళలు తప్పనిసరిగా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ధ్రువపత్రం కలిగి ఉండాలి. బయట మార్కెట్లో వేలకు వేలు ఖర్చయ్యే ఈ లైసెన్స్‌ను, ప్రభుత్వం కేవలం రూ.100 నామమాత్రపు రుసుముతోనే అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తోంది. పూతరేకుల నుంచి పచ్చళ్ల దాకా వ్యాపారం చేసే మహిళలకు ఈ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుంది.