1.12 కోట్ల పాసు పుస్తకాల పంపిణీ లక్ష్యం: చంద్రబాబు

AP: రెవెన్యూ శాఖ సమీక్షలో CM చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. 1.37 లక్షల విలేజ్‌ సర్వీస్‌ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగిస్తున్నట్లు, ఇతర సర్వీస్‌ ఇనాంలోని మరో లక్ష ఎకరాల భూములకు విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపారు. సర్వీస్‌ ఇనాంలోని భూముల విముక్తి కోసం కొత్త చట్టం తేవాలని సూచించారు. 2016కు ముందు హౌసింగ్‌ స్కీమ్‌లో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్