ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సఫారీ.. ఒకరి మృతి

AP: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం వద్ద ఇంట్లోకి టాటా సఫారీ వాహనం దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హరిత అనే మహిళ మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕