TG: అనంతపురం జిల్లా జూటూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిపై టీడీపీ నేత రవికుమార్ కొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి గాయపడగా, ఆయనను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. YCP శ్రేణులే లక్ష్యంగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.