AP: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడిలో టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మరోసారి ఓట్లు లెక్కించారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఒక్క ఓటు ఆధిక్యమే రావడంతో ఆమె గెలుపును ఖరారు చేశారు.