మడకశిర మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ

AP: వైసీపీకి బుధవారం బిగ్ షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. తాజాగా నిర్వహించిన మున్సిపల్ ఉప ఎన్నికలలో టీడీపీకి చెందిన నరసింహారాజును ఛైర్మన్‌గా, ప్రభావతిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నిక చేశారు. ఈ ప్రక్రియను ఎన్నికల ప్రత్యేక అధికారి అయిన ఆర్డీవో పర్యవేక్షించారు. అధికారికంగా ప్రకటించిన వెంటనే టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. దీంతో వైసీపీ నేతల్లో నిరాశ నెలకొంది.

సంబంధిత పోస్ట్