ప్రచార ఆర్భాటం తప్ప బీసీలకు టీడీపీ ఏమి చేయలేదని వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేయడంలో చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనలో చాలా తేడా ఉందని.. వైఎస్ జగన్ బీసీలను సమాజంలో తలెత్తుకునేలా చేశారని అన్నారు. బీసీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు, పార్టీ కమిటీల్లో పెద్ద పీట వైఎస్ జగన్ వేశారని ఆయన వివరించారు. టీడీపీ బీసీ నేతలు చంద్రబాబు మోసాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.