AP: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. మాజీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల మహానాడు వేదికగా కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కోసిగి పంచాయతీ కార్యాలయంలో రెండు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లింది. తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ అంతర్గత కలహాలు పార్టీ బలహీనతను తెలియజేస్తున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.