AP: జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ తనపై తప్పుడు కేసులు పెట్టిందని, గతంలో కూడా తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని వెల్లడించారు. కేసులు పెట్టి సాధించేది ఏమీ లేదని.. పైశాచిక ఆనందం తప్ప అంటూ పేర్కొన్నారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు.