AP: రాష్ట్రంలో MPTC, ZPTC నామినేషన్ల ప్రక్రియలో పలు చోట్ల హింస చెలరేగుతోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల సమయంలో వైసీపీ , టీడీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. టీడీపీ నేత పవన్ కుమార్ రెడ్డి కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.