AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్టైయిన విషయం తెలిసిందే. తాజాగా మరో కమెడియన్ శరత్‌కు టీడీపీ నేత వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల కిందట సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. నిన్న బెంగళూరులో షో జరుగుతుండగా వెళ్లి అతడిని నిలదీశారు. దాంతో తాను ఇప్పటికే క్షమాపణ చెప్పానని, మరోసారి చెబుతానంటూ శరత్ సారీ చెప్పడంతో వదిలేశారు.