AP: మైలవరంలో టీడీపీ నాయకులు ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి (పెద్దబాబు), రమేష్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించినందుకు షోకాజ్ నోటీసులు అందుకున్న వీరు, ఎమ్మెల్యే చర్యల వల్లే అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆటోలో ఎక్కేందుకు నిరాకరించడంతో నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు.