AP: వైఎస్ఆర్ జిల్లా సుండుపల్లి మండలం చిన్నగోల్లపల్లిలో బీజేపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధిత వ్యక్తి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో పరిషత్ ఎన్నికల్లో కూడా తమపై దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలీసుల నుండి ఎటువంటి రక్షణ లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటించడం లేదని బాధితులు పేర్కొన్నారు.