టీడీపీ నేతల దాడి.. వైసీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేయడంతో ఆయనతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడులకు నిరసనగా గాయాలతోనే ప్రతాప్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు యల్లనూరు పీఎస్ వద్ద బైఠాయించి, కూటమి ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్