జనసేన నాయకుడిపై టీడీపీ నేతలు దాడి (వీడియో)

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జనసేన నేత కారెడ్ల చిన్ని సాంబశివరావుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలని టీడీపీ నాయకులు బెదిరించగా, జనసేన నేత అడ్డుకోవడంతో చితకబాదినట్లు సమాచారం. రూ.3 వేలు అద్దె చెల్లించాల్సిన షాపునకు రూ.30 వేలు చెల్లించాలని టీడీపీ నేతలు బెదిరించడం అన్యాయమని సాంబశివరావు భార్య రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీని టీడీపీ నాయకులు మొదటి నుంచి చులకనగా చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్