వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేత‌ల దాడి (వీడియో)

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. కొత్తూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. కొత్తూరు గ్రామంలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ నేపథ్యంలో ఈ గొడవ జరిగింది. భూ కబ్జాలపై రెవెన్యూ, పోలీసు అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా? అంటూ టీడీపీ నేతలు దాడికి దిగారు. ఈ దాడిలో ఆరుగురు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురి తలలు పగిలాయి. క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్