AP: గుంటూరు జిల్లాలో పోలీసుల్ని ఉసిగొల్పి టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ధ్వంసం చేయించారని వైసీపీ ఆరోపించింది. బుధవారం ఎక్స్ వేదికగా.. ‘కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో కొలువు తీరిన గ్రామ దేవత సర్వేరెడ్డి పేరంటాలమ్మ తిరునాళ్ల సందర్భంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల ఓర్వలేనితనంతో ఆ ఫ్లెక్సీలను ధ్వంసం చేయించారు. ఇంకెన్నాళ్లు ఈ నీచ రాజకీయాలు చంద్రబాబు?’ అని వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు వీడియోను పోస్టు చేసింది.