చంద్రబాబు తీరుతో తంబళ్లపల్లె టీడీపీ నేతల్లో తీవ్ర నిరాశ

తంబళ్లపల్లె టీడీపీ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పి, చివరి నిమిషంలో వద్దు అని చంద్రబాబు చెప్పడంతో నాయకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి నియోజకవర్గానికి ఇన్‌చార్జి లేరు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు నిర్ణయించినా, రెండుసార్లు అమరావతికి పిలిపించి, చివరి నిమిషంలో రమ్మని చెప్పి, మళ్లీ వద్దు అని చెప్పడంతో నాయకులు గందరగోళానికి గురవుతున్నారు. మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో అప్పటి టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్