AP: కుప్పం నియోజకవర్గంలోని ఎంపీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన శ్రీదేవి అనే మహిళా అభ్యర్థిని టీడీపీ నాయకుడు ఆనంద్‌రెడ్డి తన అనుచరులతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో ఆమె వద్దనున్న నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, రూ. 5 వేల నగదును ఎత్తుకెళ్లారు.