AP: పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. విశాఖపట్నంలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముందంజలో ఉండగా, అమలాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఉదయం 9 గంటల సమయానికి జీవీఎంసీ (GVMC) పోస్టల్ బ్యాలెట్ల గణాంకాలు పరిశీలిస్తే, మొత్తం 437 ఓట్లలో టీడీపీకి 214, వైసీపీ 134, కాంగ్రెస్కు 3, ఇతరులకు 85.