ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో పలు ప్రాంతాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా అల్లూరు, ఇసుకపల్లి జడ్పీటీసీ స్థానాలతో పాటు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం జడ్పీటీసీ స్థానంలోనూ టీడీపీ లీడ్‌లో ఉంది. బాపట్ల జిల్లా రేపల్లె, పిట్లవానిపాలెం జడ్పీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ ఆధిక్యం సాధించింది. కృష్ణా జిల్లా పెడనలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీడీపీ ముందంజలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕