AP: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మారువేషంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామాన్యుడిలా గళ్ల లుంగీ, టీ-షర్ట్ ధరించి, మాస్క్ పెట్టుకుని ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు గంటపాటు సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఆయన మారువేషంలో ఉండటంతో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.