AP: కృష్ణా జిల్లా, గన్నవరం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనగాని రవిపై కూటమి అభ్యర్థి కుమారస్వామి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కుమారస్వామి ఓటమిని తన ఓటమిగానే భావిస్తున్నానని ప్రకటించారు. ఓటమిని అంగీకరిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో గన్నవరం జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.